సౌత్ స్టార్ బ్యూటీ సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా త్వరలోనే ఈ బ్యూటీ అమెరికా వెళ్లబోతోంది. అక్కడ ట్రీట్‌మెంట్ చేయించుకుని ఫుల్ హెల్తీగా మారాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండకు జోడీగా చేసిన `ఖుషి` మూవీ షూటింగ్ ను పూర్తి చేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
అలాగే మరోవైపు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి చేస్తున్న `సిటాడెల్` షూటింగ్ ను కూడా పూర్తి చేసేసింది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మయోసైటిస్ నుంచి కాస్త కోలుకుని.. ఓవైపు ఖుషి, మరోవైపు సిటాడెల్ ను త్వరత్వరగా కానిచ్చేసిన సమంత కొద్ది నెలలు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయింది. అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకునే వరకు సెలవు తీసుకోవాలని అనుకుంది.
అయితే సినిమాలకు సడెన్ బ్రేక్ ఇవ్వడం వల్ల సమంత ఎన్ని కోట్లు నష్టపోయిందో తెలిస్తే దిమ్మతిరుగుద్ది. అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైన సమంత.. ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకుంది. నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులు కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది. టాలీవుడ్ లోనే మూడు పెద్ద నిర్మాణ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి.. వారు ఇచ్చిన డబ్బు రిటర్న్ చేసింది. అలా సమంత కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏకంగా రూ. 12 నుంచి 13 కోట్ల రేంజ్ లో నష్టపోయిందట. ప్రస్తుతం ఈ విషయంలో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.