బిగ్‌బాస్ హోస్ట్ చేంజ్‌.. ఆ స్టార్ హీరోతో ఆడియన్స్ సర్‌ప్రైజ్…

బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్‌బాస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. బుల్లితెరపై నంబర్ వన్ రియాల్టీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్‌బాస్. సరికొత్త కంటెంట్ పరిచయం అయ్యి ప్రేక్షకుల ఆదరణను అందుకుంటున్న ఈ షో ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకొని 7 వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా కొత్త సీజన్‌కి సంబంధించిన హోస్ట్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దీని ద్వారా అందరిలో షోపై అంచనాలను పెంచేసారు.

తెలుగులో బిగ్గెస్ట్ రియాల్టీ షోగా మొదలైన బిగ్‌బాస్ షో ఇప్పటివరకు వచ్చిన ప్రతీ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. కానీ మొదటి, ఆరవ సీజన్ మాత్రం కాస్త చప్పగా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాటికి తోడు ఫేక్ ఎలిమినేషన్, లవ్వు, రొమాన్స్, గొడవలు, సప్పగా ఉన్న టాస్కులు కారణంగా ఆ రెండు సీజన్స్ కి రేటింగ్ కూడా సరిగా రాలేదు. దాంతో బిగ్‌బాస్ సీజన్‌లోనే డిజాస్టర్ సీజన్‌గా నిలిచాయి. ఆరో సీజన్ ఫెయిల్ అవ్వడంతో ఏడవ సీజన్ ని ఎలాగైనా సక్సెస్ చేయాలని నిర్వాహకులు గట్టి పట్టదలతో ఉన్నారు.

అందుకే ఈసారి బిగ్‌బాస్ సీజన్‌ని త్వరగా స్టార్ట్ చేస్తున్నారు. దానికోసం నాన్ స్టాప్ సీజన్ కూడా క్యాన్సిల్ చేసేసారు. ఇక ఇటీవల సెవెంత్ సీజన్ కి సంబంధించిన లోగోని విడుదల చేసి బిబి ఫాన్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చారు నిర్వాహకులు. ఆరవ సీజన్ ఫెయిల్ అయిన కారణంగా ఈసారి బిగ్‌బాస్ సీజన్‌కి హోస్ట్‌గా బాలకృష్ణ, చిరంజీవి, మంచు విష్ణు ఇలా చాలా మంది పేర్లు వినపడ్డాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 7వ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు బిబి టీమ్. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా తాజాగా విడుదల చేశారు.

హోస్ట్ ఫిక్స్ అయ్యారు కాబట్టి తాజాగా విడుదల అయిన ప్రోమో గురించి మాట్లాడుకుంటే నాగార్జున ఆ ప్రమోలో చాలా స్టైలిష్ గా కనపడ్డారు. అంతేకాకుండా ఆయన ప్రమోలో ‘ ఈసారి బిగ్ బాస్ 7 గురించి ఎలా చెప్పాలి? చాలా కొత్తగా.. ప్రతిసారి ఇదేగా చెప్తున్నా.. హ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ‘ అంటూ రానున్న సీజన్ పై అందరిలో కాస్త సస్పెన్స్ ని క్రియేట్ చేసారు. దాంతో ఈసారి బిగ్ బాస్ షో చాలా కొత్తగా ఉండనుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.