ప్ర‌భాస్ `క‌ల్కి`పై రాజ‌మౌళి బిగ్ డౌట్‌.. తెలిసి అడిగాడా? లేక తెలియ‌క అడిగాడా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబోనేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తుంటే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. భవిష్యత్ కాలమైన 2898 సంవత్సరంలో జరిగే కథగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.

కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో రెండు రోజుల క్రితం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుద‌ల చేశారు. ఈ గింప్ల్స్ కు ఊహ‌కు అంద‌ని రెస్పాన్స్ ల‌భించింది. గ్లింప్స్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ చిత్ర టీమ్ ప‌నిత‌నంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. హాలీవుడ్ రేంజ్‏లో విజువల్స్ ఉన్నాయ‌ని కొనియాడారు. తాజాగా క‌ల్కి గ్లింప్స్ వీడియో చూసిన‌ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ పెట్టారు.

గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. భవిష్యత్ కు చెందిన కథాంశంతో నికార్సయిన సినిమా తీయడం చాలా కష్టం. కానీ మీరందరూ అసాధ్యం సుసాధ్యం చేశారు. డార్లింగ్ లుక్స్ అదిరిపోయాయి అంటూ రాజ‌మౌళి త‌న ట్వీట్ లో పేర్కొన్నాడు. అలాగే చివ‌ర్లో ఈయ‌న ఓ బిగ్ డౌట్ వ్య‌క్తి ప‌రిచాడు. ఇక ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. అదే క‌ల్కి రిలీజ్ డేట్‌..? అంటూ ప్ర‌శ్నించాడు. ఇదే రాజ‌మౌళి కొంప ముంచింది. ఈ ప్ర‌శ్న తెలిసి అడిగాడా? లేక తెలియ‌క అడిగాడా? అన్న‌ది తెలియ‌దు గానీ.. నెటిజ‌న్లు మాత్రం రాజ‌మౌళిపై వ‌రుస కౌంట‌ర్లు వేస్తున్నారు. ఎందుకంటే, క‌ల్కీ రిలీజ్ డేట్ ను ఎప్పుడో అనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.