నయం కాని వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక చోప్రా..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. 1982 జులై 18న జార్ఖండ్లో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 41 సంవత్సరాలు. ఈమె పుట్టిన ఐదేళ్ల వయసు అప్పుడే నయం కానీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కు ఆస్తమా ఉన్నట్లు సమాచారం. ఆ వ్యాధితో బాధపడుతున్న ఈమె చాలా సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

Priyanka Chopra and Nick Jonas attend Wimbledon; US Open cracks a tennis  joke - Hindustan Times

తనకు ఐదేళ్ల వయసులోనే ఆస్తమా ఉందని ప్రియాంకనే స్వయంగా తెలియజేయడం జరిగింది. ఈ వ్యాధి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ప్రియాంక చోప్రా దగ్గర ఎప్పుడు ఇన్ హెల్లర్ ఉంచుకుంటోందని సమాచారం. ప్రియాంక చోప్రా కెరియర్ విషయానికి వస్తే 2003లో విడుదలైన హీరో చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఆ తర్వాత ఈమె హిందీ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అలాంటి పాపులారిటీతోనే హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా పలు వెబ్ సిరీస్లలో సినిమాలలో నటిస్తోంది.

Priyanka Chopra Talks Quitting Bollywood for America, Landing Quantico –  The Hollywood Reporter

2018 వ సంవత్సరంలో ఆమె నిక్ జోనస్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ప్రియాంక చోప్రా తన కుమార్తెకు మాల్తీ మేరీ చోప్రా జోనస్ అనే పేరును కూడా నామకరణం చేసింది. ఈ రోజున ప్రియాంక చోప్రా బర్త్డే సందర్భంగా ఈమెకు సంబంధించిన పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా ఇలాంటి వ్యాధితో బాధపడుతోందని తెలిసి అభిమానుల సైతం తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ.