విడాకులు తీసుకోబోతున్న కలర్స్ స్వాతి.. ఇదే ప్రూఫ్..!

మొదట బుల్లితెర నుంచి యాంకర్ గా ప్రేక్షకులను అలరించి వెండితెర పైన అలరించింది హీరోయిన్ కలర్ స్వాతి. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషలలో కూడా నటించి మెప్పించిన ఈమె మొదటిసారి ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రంలో వెంకటేష్ మరదలు పాత్రలు నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ వెంటనే అష్టా చమ్మ ,కార్తికేయ ,స్వామి రారా వంటి తదితర చిత్రాలలో నటించింది. దీంతో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కలర్ స్వాతి.

When Swathi Reddy Reacted To Divorce Rumors with Vikas Vasu With In a Shocking Way

తాజాగా కలర్స్ స్వాతి గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే గత కొద్ది రోజుల నుంచి తన భర్త వికాస్ కు దూరంగా ఉన్నట్లు ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.ఈ ప్రచారానికి ప్రధాన కారణం తన భర్త ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ నుంచి తొలగించడమే అన్నట్లుగా సమాచారం.. గతంలో కూడా హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడిపోయేటప్పుడు ఇలాంటి పనే చేసింది ఇక నిహారిక కూడా ఇటీవల ఇలాంటి పనిచేయడం జరిగింది.

దీంతో తాజాగా కలర్స్ స్వాతి కూడా తన భర్త ఫోటోలను ఇంస్టాగ్రామ్ నుంచి తొలగించిందని తను కూడా విడాకులు తీసుకోబోతోంది అంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ తో పాటు సోషల్ మీడియాలో ఈ వార్తలు వాయిదాలుగా మారుతున్నాయి. అయితే కలర్స్ స్వాతి విషయంలో ఇలాంటి ప్రచారం జరగడం ఇదేమి కొత్త ఏమీ కాదు గతంలో కూడా రెండుసార్లు ఇలానే తమ వివాహ బంధంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రచారం జరిగింది. అప్పట్లో తన భర్త ఫోటోలను ఆర్కియూస్ లో దాచుకున్నారని చెబుతూ ఒక వీడియోను సైతం షేర్ చేయడం జరిగింది. మరి ఈసారి కూడా ఇలాంటి వార్తలకు చెక్ పెడుతుందేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Swathi (@swati194)