ఉచిత విద్యుత్‌ని కవర్ చేసిన కారు..కాంగ్రెస్ సక్సెస్.!

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పోరు నడుస్తుంది. ముఖ్యంగా కే‌టి‌ఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు యుద్ధం నడుస్తుంది. అయితే అమెరికాలో ఉండగా రేవంత్..3 ఎకరాలు నీరు పెట్టడానికి 3 గంటలు సరిపోతుందని, సరాసరినా రోజుకు 8 గంటల చాలు అని అన్నారు. 24 గంటల కరెంట్ వద్దని చెప్పలేదు.

కానీ అదిగో రేవంత్ 3 గంటలే అంటున్నారని, తాము 24 గంటల ఇస్తున్నామని కే‌టి‌ఆర్ కౌంటర్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ రివర్స్ అయింది. అసలు కే‌సి‌ఆర్ ప్రభుత్వం సరిగా 12 గంటల కూడా ఇవ్వడం లేదని, తాము వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, తన మాటలని వక్రీకరించారని, కాంగ్రెస్ అంటేనే ఉచిత విద్యుత్ అని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ నేతలు పలు సబ్‌స్టేషన్లుకు వెళ్ళి ఎన్ని గంటల కరెంట్ వస్తుందో చెక్ చేశారు..ఎక్కడా కూడా 24 గంటలు రావడం లేదు.

ఈ క్రమంలో బి‌ఆర్‌ఎస్..రేవంత్ వ్యాఖ్యలపై నిరసనలు తెలియజేస్తుంది. దీంతో కాంగ్రెస్ రివర్స్ అయ్యి…విద్యుత్ సబ్ స్టేషన్లకు వెళ్ళి..ఎన్ని గంటల కరెంట్ వస్తుందో చెక్ చేస్తుంది. దీంతో బి‌ఆర్‌ఎస్ కరెంట్ ఇచ్చే సమయాన్ని పెంచుతూ వస్తుంది. ఇప్పటికే రైతులకు 24 గంటలూ అక్కర్లేదని ఎర్రబెల్లి చెప్పడం, ఎన్ని గంటలనేది కాదు.. నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నామని  ట్రాన్స్‌కో సీఎండీ అనడంతో అసలు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని తేలిపోయింది.

ఇక కాంగ్రెస్ రివర్స్ అవ్వడంతో.. అన్ని జిల్లాల్లోనూ సబ్‌స్టేషన్లలోని లాగ్‌బుక్కులను మార్చేస్తున్నారు. మొన్నటివరకు 12 గంటలు.. ఇచ్చారు  ప్రస్తుతం కాంగ్రెస్ దెబ్బతో 20 గంటల పైనే సరఫరా చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎదురుదాడితో త్రీఫేజ్‌ కరెంటు సరఫరాలో మార్పులు చేశారని తెలుస్తుంది. లాగ్‌బుక్కులతో అధికార పార్టీని కాంగ్రెస్ ఇరుకున పెట్టింది.