ప‌వ‌న్ తో గ‌డిపిన ఆ 5 నిమిషాలు మ‌ర్చిపోలేను.. `బ్రో` బ్యూటీ బోల్డ్ కామెంట్స్!

మ‌రో ప‌ది రోజుల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయన మెన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించిన మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో` ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది.

కోలీవుడ్ సూప‌ర్ హిట్ `వినోద‌త సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో మూవీ జూలై 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే సినిమా ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్న‌యి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కేతిక శ‌ర్మ.. బ్రో సినిమాకు సంబంధించి అనేక విష‌యాలు పంచుకుంది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి కోస‌మే ఈ మూవీకి సైన్ చేశార‌న‌ని కేతిక బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆయన సినిమా అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాన‌ని ఆమె పేర్కొంది.

అయితే పవన్ కళ్యాణ్ గారితో నేరుగా వెళ్లి మాట్లాడాలంటే చాలా భయమేసింది. దాంతో తేజ్ నన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. ఆరోజు ఆయనతో గ‌డిపిన ఆ ఐదు నిమిషాలు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేను. కాంబినేషన్ సీన్స్ లేకపోవడం వల్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార్ ను ఎక్కువ కలవలేకపోయాను అని కేతిక పేర్కొంది. ఇక తాను ఈ సినిమాలో తేజ్ ప్రేయ‌సిగా క‌నిపిస్తాన‌ని.. బ్రో వంటి మంచి మూవీలో న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంద‌ని, ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని కేతిక ధీమా వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలోనే స‌ముద్ర‌ఖ‌ని, త్రివిక్ర‌మ్ గురించి కూడా కేతిక గొప్ప‌గా చెప్పుకొచ్చింది.