హాఫ్ సెంచ‌రీ చేసేసిన వ‌ర‌ల‌క్ష్మి.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు వేస్టేనా..?

సీనియ‌ర్ స్టార్ శ‌ర‌త్ కుమార్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వ‌ర‌ల‌క్ష్మి.. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కోలీవుడ్ లో ప‌లు హిట్ సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా డిజాస్ట‌ర్స్ ప‌డ‌టంతో హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గాయి. అయినా కూడా వ‌రల‌క్ష్మి వెన‌క‌డుగు వేయ‌లేదు. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో లేడీ విల‌న్ రోల్స్ చేయ‌డం స్టార్ట్ చేసి.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సూప‌ర్ స‌క్సెస్ అయింది.

త‌న ముందు స్టార్ హీరోయిన్లు కూడా వెస్టే అన్న రీతిలో వ‌ర‌ల‌క్ష్మి కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. ఓవైపు విల‌న్ రోల్స్.. మ‌రోవైపు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న వ‌ర‌ల‌క్ష్మి.. ఈ మ‌ధ్య లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌కు కూడా క‌మిట్ అవుతోంది. ఇప్పుడామె చేతిలో దాదాపుగా ప‌ది చిత్రాలు ఉన్నాయి అంటే.. వ‌ర‌ల‌క్ష్మి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

అన్న‌ట్లు తాజాగా ఈ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ హాఫ్ సెంచ‌రీ మైలు రాయిని అధిగ‌మించింది. తెలుగు, త‌మిళ్ త‌దిత‌ర భాష‌ల్లో కెరీర్ ప‌రంగా 50 సినిమాలు పూర్తి చేసింది. ఇదే విష‌యాన్ని వ‌ర‌ల‌క్ష్మి సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. యాభై చిత్రాలు పూర్తి చేయ‌డానికి అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు. ఇంత కాలం న‌టిగా కొన‌సాగుతాన‌ని, ఇన్ని సినిమాలు చేస్తాన‌ని అనుకోలేదు. ఇక‌పై యాక్టింగ్ ఆపే ప్ర‌స‌క్తే లేదు అంటూ వ‌ర‌ల‌క్ష్మి చెబుతూ సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.