పవన్ ‘బ్రో’ ట్రైలర్ వచ్చేసిందోచ్.. ప్రతి డైలాగు తూటానే.. ఈ మామ అల్లుళ్ళ రచ్చ మామూలుగా లేదుగా(వీడియో)..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన బ్రో సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేశారు . మొదటి నుంచి పవన్ కళ్యాణ్ బ్రో సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఫ్యాన్స్ అదే విధంగా ఏ మాత్రం తగ్గని రేంజ్ లో సముద్రఖని తెరకెక్కించారు అని చిన్న ట్రైలర్తోనే తెలిసిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ చూసిన తర్వాత మనం బద్రి సినిమాలోని పవన్ కళ్యాణ్ ని గుర్తు చేసుకుంటాం అంటూ చెప్పుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

ట్రైలర్ విషయానికి వస్తే ..మొదటనే పవన్ వాయిస్ ఇస్తూ ” బస్మాసురుడు అని ఒకడుండేవాడు తెలుసా .. మీ మనుషులంతా వాడి జాతే.. మీ తలపై మీరే పెట్టుకుంటూ ఉంటారు” అంటూ సెటైరికల్ డైలాగ్ తో రియాలిటీని పలుకుతూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ హైలెట్గా మారాయి . ఆ తర్వాత తేజ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫన్నీ సీన్స్ కూడా చూపిస్తూ వచ్చాడు సముద్రఖని. అయితే తనకు తాను కూడా టైం ఇచ్చుకోలేని అంత బిజీగా ఉండే సాయిధరమ్ తేజ్ కి మరణం సంభవించి అప్పుడు టైం వాల్యూ తెలిసేలా చేస్తాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దేవుడిగా కనిపించబోతున్నాడు అనేది హైలెట్ గా మారిపోతుంది .

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సాయి కు సెటైరికల్ డైలాగ్ కొడుతూ “నీ దగ్గర ఎప్పుడూ లేదు చూసావా ..అదే నేను ..నీ టైం” అంటూ క్రేజీ డైలాగ్ చెప్పుకొస్తాడు. ట్రైలర్లో ప్రతి డైలాగ్ మాటలు తూటాలు లా పెలాయి. తమన్ బిజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రతి సీన్లోనూ డైలాగ్ ఎంత హైలెట్ అయిందో తమన్ బిజిఎం కూడా అంతే హైలెట్ అయింది. చివర్లో పవన్ మార్క్ ఎంటర్టైనింగ్ స్టైల్ లో ట్రైలర్ ని ఎండ్ చేస్తూ మ్యూజిక్ థీమ్స్ రిథమ్స్ ని తనదైన స్టైల్ లో పలికిస్తాడు పవన్ కళ్యాణ్ . ఒక ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ని పవన్ అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అదే విధంగా చూపించాడు సముద్రఖని. ఈ సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ అంతా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ట్రైలర్ తోనే తెలిసిపోతుంది . జూలై 28న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ అందుకుంటుందో..? ప్రెసెంట్ 2 నిమిషాల17 సెకండ్ అనిపించే విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!