ఒక్క రోజుకి కమెడియన్స్ ఎంత పారితోషికం తీసుకుంటారో తెలుసా..

సినీ ఇండస్ట్రీ లో నటినటులు ఎంతోమంది ఉన్నారు. అయితే హీరో హీరోయిన్లతో సమానంగా డబ్బు సంపాదించే కమెడియన్లు కూడా ఇండస్ట్రీ లో ఉన్నారు. ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రతో పాటు కమెడియన్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సినిమాలో కామెడీ అనేది కీలక పాత్ర వహిస్తుంది. సినిమాలో కామెడీ లేకపోతే ప్రేక్షకులు ఆ సినిమాను చూడటానికి పెద్దగా ఇష్టపడరు. దాంతో ఇండస్ట్రీలో కమెడియన్లకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. స్టార్ కమెడియన్లు గా ఎదిగినవారు ప్రస్తుతం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బ్రహ్మానందం ఒక రోజుకి దాదాపు 5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.


ఇక బాలనటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలీ గురించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు హీరోగా నటించాడు. ఆ తరువాత కమెడియన్ గా ఎంతోమందిని అల్లరిస్తున్నాడు. అలీ ఒక రోజుకి 3.5 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.

ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా దుసుకుపోతున్న ప్రియదర్శి ఒక రోజుకి నాలుగు లక్షల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నాడు. ఇక వెన్నెల కిషోర్ రోజుకి మూడు లక్షలు తీసుకుంటుండగా, సునీల్ రోజుకి నాలుగు లక్షలు, పోసాని కృష్ణ మురళి రెండు లక్షల రెమ్యూనేషన్ తీసుకుంటున్నాడు.