ఆక‌ట్టుకుంటున్న `హాయ్ నాన్న` ఫస్ట్ గ్లింప్స్.. కానీ, చివ‌ర్లో ఈ ట్విస్ట్ ఏంటి నానీ..?

ద‌స‌రా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. ప్ర‌స్తుతం త‌న 30వ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. తండ్రీ, కూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ టైటిల్ ను లాక్ చేశారు.

తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ గ్లింప్స్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. నా ఫ్రెండ్‌ యశ్నను కలవండి.. అంటూ మృణాళ్‌ ఠాకూర్‌ను తన స్నేహితురాలికి పరిచయం చేస్తూ బేబి కైరా చెప్తున్న డైలాగ్స్‌తో గ్లింప్స్ ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత మా నాన్న అంటూ ఆ చిన్నారి వాయిస్ వినిపించ‌గానే.. నాని స్టైలిష్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. గ్లింప్స్ మొత్తం హర్ట్‌ టచింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో విశేషంగా ఆక‌ట్టుకుంది.

అయితే గ్లింప్స్ చివ‌ర్లో మృణాల్ ఠాకూర్ కూడా నానిని `హాయ్ నాన్న` అంటూ ప‌ల‌క‌రించ‌డం అస‌లు ట్విస్ట్‌. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో నాని కూడా ప్ర‌స్తావించాడు. `హాయ్ నాన్న అని ఆమె(హృణాల్‌) న‌న్ను పిలుస్తుంది. చిన్నారి కాదు` అంటూ స‌స్పెన్స్ క్రియేట్ చేశారు. మ‌రి నానీని మృణాల్ నాన్న అని ఎందుకు పిలుస్తుందో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అన్న‌ట్లు ఈ సినిమా డిసెంబ‌ర్ 21న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఇందులో శృతి హాస‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోసిస్తుందన్న టాక్ ఉంది.