దిల్ రాజు- డైరెక్టర్ శంకర్ మధ్య విభేదాలు నిజమేనా..?

టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మిస్తున్నారు అంటే ఆ సినిమా ప్లానింగ్ ప్రకారం గా నిర్మిస్తూ ఉంటారు. తనదైన స్టైల్లో సినిమా ప్రమోషన్స్ ను చేస్తూ ఉంటారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైన ఇప్పటివరకు ఈ సినిమా అనుకున్నంత విధంగా జరగలేదు కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

RC15: Ram Charan, Dil Raju Meets Director Shankar In Chennai | Clapnumber

ఈ సినిమా కోసం దిల్ రాజు భారీగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది ఈ సినిమా కోసం పెద్ద రిస్క్ చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు దిల్ రాజు శంకర్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అటు దిల్ రాజు గాని, శంకర్ గాని ధ్రువీకరించలేదు. దిల్ రాజు జి స్టూడియోస్తో కలిసి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. సోలో హీరోగా రామ్ చరణ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇది.

గేమ్ చేంజెస్ సినిమా ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా RRR చిత్రం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు మంచి హైట్ ఏర్పడుతోంది. అయితే రామ్ చరణ్ అభిమానులు మాత్రం గేమ్ చేంజెస్ సినిమాకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలి కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి కూడా నటిస్తున్నారు.