ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయావా.. లావణ్య త్రిపాఠిని దారుణంగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌!

అందాల రాక్ష‌సి మూవీతో అంద‌రి మ‌న‌సులో దోచేసిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి త్వ‌ర‌లోనే మెగా కోడ‌లు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడు ఏళ్ల నుంచి మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో సీక్రెట్ గా ప్రేమాయ‌ణం న‌డిపించిన లావ‌ణ్య‌.. ఇప్పుడు ప్రియ సుఖుడితో ఏడ‌డుగులు వేయ‌బోతోంది. గ‌త నెల‌లో వీరిద్ద‌రి ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది.

ఈ ఏడాది చివ‌ర్లో వ‌రుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ త‌మ త‌మ‌ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే లావ‌ణ్య త్రిపాఠి.. తాజాగా ఫారెన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోల‌ను పంచుకుంది. ఈ పిక్స్ లో వైట్ క‌ల‌ర్ మినీ డ్రెస్ ధ‌రించిన, గ్లాసెస్ పెట్టుకుని సూప‌ర్ స్టైలిష్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది.

థండ‌ర్ థైస్ ను చూపిస్తూ ద‌డ‌ద‌డ‌లాడించింది. లావ‌ణ్య ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు ఆమె పిక్స్ పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. కానీ, మెగా ఫ్యాన్స్ కు మాత్రం లావ‌ణ్య అలా స్కిన్ షో చేయ‌డం ఏ మాత్రం న‌చ్చ‌లేదు. దీంతో ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయావా.. ఇక‌నైనా మంచి డ్రెస్‌లు వేసుకో అంటూ కాబోయే మెగా కోడ‌ల‌ను ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అన్న‌ట్లు లావ‌ణ్య ఒంటిరిగా కాదు.. వ‌రుణ్ తేజ్ తోనే ఫారెన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఆమె లెటెస్ట్ పిక్స్ ను కెమెరాల్లో బందించింది కూడా వ‌రుణ్ తేజే కావ‌డం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)