బంపర్ ఆఫర్ కొట్టేసిన ఎన్టీఆర్ బామ్మర్ది.. హిట్ అయినట్టేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకరి తరువాత ఒకరు హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి భారీ పాపులారిటీ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా భారీ గుర్తింపు సంపాదించుకున్న వారు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. మరొకవైపు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి చలామణి అవుతున్న వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది గ్లోబల్ స్టార్ లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా తమ బంధువులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన బావమరిది అలియాస్ తన భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ ను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

Teja To Launch NTR's Brother-In-Law Narne Nithin

టాలీవుడ్ లోకి ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హీరోగా తన మొదటి చిత్రం చేయబోతున్న నేపథ్యంలో మొదటి ఎంట్రీ తోనే అలా ఇలా కాకుండా ఒక సాలిడ్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎప్పటినుంచో ఎంట్రీ ఇవ్వాలని ఆరాటపడుతున్న నార్నే నితిన్ కి ఈ సంస్థ ఒక గొప్ప ఆఫర్ కలిగించిందని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ కొన్ని కారణాలవల్ల నార్నే నితిన్ హీరోగా ఇండస్ట్రీలోకి లాంచ్ కాలేకపోయారు. ఎలాగైనా సరే ఈసారి పక్కా పగడ్బందీ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

Jr NTR : హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఎన్టీఆర్ బామ్మర్ధి నార్నే నితిన్.. సినీ  ఇండస్ట్రీలో బావలతో సై అంటున్న బామ్మర్ధులు వీళ్లే..– News18 Telugu

ఎన్టీఆర్ విషయానికి వస్తే.. బావమరిది ఎంట్రీ కోసం అన్ని ఆయనే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది లక్ష్మీప్రణతి కోరిక మేరకే ఇదంతా జరుగుతోందన్న వార్తలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.. మొత్తానికైతే నార్నే నితిన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బావ ఎన్టీఆర్ పేరును నిలబెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.