యాంకర్ చెల్లితో హైపర్ ఆది ప్రేమాయణం..అభిమానులకి ఊహించని ట్విస్ట్ ఇది..!!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో పలు రోల్స్ చేస్తూ రాజకీయాలలోను అడుగుపెట్టిన హైపర్ ఆది ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్ లో ఉన్నాడు అర్థం చేసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో మినిమం హీరో కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే ఎక్కువ ఉంది హైపర్ ఆదికి . ఓ పక్క జబర్దస్త్ మరోపక్క రాజకీయాల ఈవెంట్స్ మరోపక్క సినిమాలో ఇలా బిజీబిజీగా గడిపేస్తున్న హైపర్ ఆదికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

హైపర్ ఆది పెళ్లెప్పుడు చేసుకుంటాడో..? ఎవరిని చేసుకుంటారని..? ఎంతోమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఆయన పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. యాంకర్ చెల్లితో ప్రేమాయణం నడుపుతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది . యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఓ యాంకర్ తో పరిచయం ఏర్పడిందని ..ఆమె ద్వారానే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారని ..ఈ క్రమంలోనే ఆమెతో మొదలైన పరిచయం స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు ఈ యాంకర్ వాళ్ళ అక్క కూడా మరో యాంకర్ కావడం గమనార్హం . దీంతో నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఉండే ఎవరైనా టాప్ సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటాడు అనుకున్న హైపర్ ఆది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ యాంకర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడా అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!