మగధీర సినిమాకు రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్లు ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరోతో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది . అలా చాలామంది హీరోలకి డైరెక్టర్లకి జరిగే ఉంటుంది . అయితే కొన్ని కొన్ని సార్లు మనం తీయాల్సిన సినిమాను మరో హీరో చేతిలో వెళ్లి ..ఆ హీరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడితే ఆ బాధ చాలా వర్ణాతితంగా ఉంటుంది . అయితే ఇక్కడ మాత్రం ఈ తెలుగు హీరో తాను చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్ కొడితే సంతోషపడ్డాడు .

ఆ హీరోనే ప్రభాస్ .. ఎస్ టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ చేతిలోకి మగధీర సినిమా కథ వచ్చింది . అయితే అప్పటికే వేరే సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ .. ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. దీంతో ఈ కథ రామ్ చరణ్ చేతికి వెళ్ళింది. కాగా రెండో సినిమాతోనే దర్శకధీరుడు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో వర్క్ చేసే ఛాన్స్ అందుకున్న రాంచరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

అంతేకాదు అప్పటివరకు పెద్దగా మార్కెట్ లేని చహ్రణ్ ని నమ్మి అల్లు అరవింద్ కోట్లు పెట్టేశాడు. దీంతో సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటుందో అంటూ చాలా టెన్షన్ పడ్డారు మెగా ఫాన్స్ . అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా అప్పట్లోనే 80 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత ఎంతటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకుందో మనకు తెలిసిందే. రామ్ చరణ్ – కాజల్ కెరీయర్ని మలుపు తిప్పింది మగధీర సినిమా నే అని చెప్పాలి . అంతటి మంచి సినిమాని ప్రభాస్ మిస్ చేసుకున్నాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!