వైసీపీ వర్సెస్ జనసేన..పవన్ బరిలో దిగే సీటులో రచ్చ.!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ-జనసేన ఓ రేంజ్ లో పోరాటం చేస్తున్నాయి. ఇక రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతుండటంతో వైసీపీ సైతం..రెండు పార్టీలకు ఎక్కడకక్కడ చెక్ పెట్టే దిశగానే రాజకీయం చేస్తుంది. ఎక్కడ కూడా ఆ రెండు పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని చూస్తుంది. ఇదే సమయంలో ఫ్లెక్సీల విషయంలో కూడా వైసీపీ తగ్గడం లేదు. పేదలకు, పెత్తందార్లకు యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు కడుతున్న విషయం తెలిసిందే.

అందుకే పేదలని కాపాడుతూ జగన్ ఫోటో..జగన్ పైకి రాళ్ళు వేస్తూ చంద్రబాబు, లోకేష్…వారి పల్లకిని మోస్తున్నట్లు పవన్ ఫోటోని పెట్టారు. దీనిపై టి‌డి‌పి, జనసేన పార్టీలు ఫైర్ అవుతున్నాయి. వైసీపీకి పోటీగా జగనాసుర రక్త చరిత్ర అంటూ పది తలలతో ఉన్న జగన్ ఫోటో పెడుతున్నారు. కానీ పోలీసులు చేత టి‌డి‌పి‌, జనసేన ఫ్లెక్సీలు తీయించేస్తున్నారు. కానీ వైసీపీ ఫ్లెక్సీల జోలికి వెళ్ళడం లేదు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ, జనసేనల మధ్య రచ్చ నడుస్తుంది.

ఇక పవన్ ఫోటోని అభ్యంతరకరంగా పెట్టడంపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు..అయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో జగన్ పై ఫ్లెక్సీలు వేసేందుకు జనసేన శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు జిల్లా అధ్యక్షుడు గోవిందరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు గోవిందరావుని విడుదల చేశారు.

అయితే పవన్ భీమవరం బరిలోనే దిగుతారని తెలుస్తుంది…అందుకే ఆ నియోజకవర్గాన్నే వైసీపీ మళ్ళీ టార్గెట్ చేసింది..కానీ ఈ సారి జనసేన శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వైసీపీకి ధీటుగా ముందుకెళుతున్నారు. మొత్తానికి భీమవరంలో వైసీపీ, జనసేనల మధ్య పోరు ఓ రేంజ్ లో నడుస్తుంది.