మ‌రో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని భార్య‌కు అడ్డంగా దొరికిపోయిన ఎన్టీఆర్‌.. దుమారం రేపుతున్న ట్వీట్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా. నందమూరి వారసుడు అయినప్పటికీ తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అటువంటి ఎన్టీఆర్ మరో అమ్మాయితో సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకొని భార్య లక్ష్మీ ప్రణతికి అడ్డంగా దొరికిపోయాడు అంటూ ఆరోపణలు చేశాడో వివాదాస్పద క్రిటిక్‌.

ఇంత‌కీ అతనెవ‌రో కాదు ఉమైర్ సంధు. ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్ మెంబర్ గా చెప్పుకునే తిరిగే ఫిల్మ్ క్రిటిక్‌.. గ‌త కొంత కాలం నుంచి సినీ తార‌ల‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న ట్వీట్స్ చేస్తున్నాడు. ఎవ‌రికి ప‌డితే వారికి అక్రమ సంబంధాలు అంట‌గ‌డుతూ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పై ఓ షాకింగ్ ట్వీట్ వేశాడు.

ఎన్టీఆర్‌కి మరో అమ్మాయితో ఇల్లీగల్‌ ఎఫైర్ ఉంద‌ని, ఇటీవల ఆ అమ్మాయితో భార్య‌కు దొరికిపోయాడని.. ల‌క్ష్మి ప్ర‌ణ‌తి ఎన్టీఆర్ ఫోన్ చెక్ చేయ‌డ‌గా ఈ విష‌యం బ‌య‌టప‌డింద‌ని ఉమైర్ సంధు ఆరోపించాడు. అంతేకాదు, టాలీవుడ్‌లో ఎన్టీఆర్ మాత్ర‌మే కాకుండా ప్రతి ఒక్క నటుడు ఇలాంటి సీక్రెట్‌ ఎఫైర్స్ కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. దీంతో ఉమైర్ సంధు ట్వీట్ నెట్టింట పెను దుమారం రేపుతోంది. నంద‌మూరి ఫ్యాన్స్ ఉమైర్ సంధును ప‌చ్చి బూతులు తిడుతూ విమ‌ర్శిస్తున్నారు. అయినాస‌రే అత‌డి తీరు మారేలా క‌నిపించ‌డం లేదు.