వైసీపీ స్ట్రాటజీ: ఓట్లు లేపేస్తున్నారు..దొంగ ఓట్లు వచ్చేస్తున్నాయ్.!

వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం అధికార వైసీపీ అన్నీ రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా గెలుపు దిశగా ముందుకెళుతుంది. అధికార బలాన్ని పూర్తిగా వాడుకున్నట్లు కనిపిస్తుంది. ఇదే క్రమంలో అధికార పార్టీ గెలవడం కోసం అనేక అడ్డదారుల్లో వెళుతుందని ప్రతిపక్ష టి‌డి‌పి ఆరోపిస్తుంది. ముఖ్యంగా టి‌డి‌పి అనుకూలంగా ఉన్న ఓట్లు  తొలగించడం..వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు క్రియేట్ చేయడం చేస్తుందని టి‌డి‌పి అంటుంది.

ఇటీవల కాలంలో ఒకే డోర్ నెంబర్ తో వందల కొద్ది ఓట్లు నమోదయ్యి ఉండటం బయటపడిన విషయం తెలిసిందే. గుంటూరులో ఈ అంశం హైలైట్ అయింది. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 152 లోని కడియాల వారి వీధి, సీతరామపురంలో ఒకే డోర్ నెంబర్ తో 506 ఓటర్ల పేర్లు నమోదయ్యాయని టి‌డి‌పి నేత బోండా ఉమా ఆధారాలతో సహ మీడియాకి వివరించారు. ఈ ఏడాది జనవరిలో ఓటర్ల జాబితాని ప్రకటించారని, అప్పుడు 7879 మంది ఓటర్ల పేర్లు తొలగించి..2360 పేర్లు చేర్చారని, అయితే దీనిపై తనకు అనుమానం ఉందని టి‌డి‌పి సానుకూలంగా ఉండే ఓట్లు తొలగించి…వైసీపీ దొంగ ఓట్లు క్రియేట్ చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కుప్పం నియోజకవర్గంలో ఓ వూరులో వందల కొద్ది ఓట్లు తొలగించడం సంచలనంగా మారింది.

ఇదంతా వైసీపీనే చేయిస్తుంది. గెలవడం కోసం టి‌డి‌పి వాళ్ళ ఓట్లని తొలగించడం, వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు క్రియేట్ చేయడం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి ఇవి నిజంగా పెద్ద స్థాయిలో జరిగుంటే గెలుపోటములని ప్రభావితం చేస్తుందనే చెప్పాలి.