‘OG’ లో పవన్ పాత్ర పేరు ఇదే..పవన్ ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే అప్డేట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో బిజీగా ముందుకు వెళ్తున్నాడు. కొద్దిపాటి టైం దొరికిన సినిమాల్లో నటిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు అభిమానుల్ని. కాగ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ప్రాజెక్టులలో “OG” కూడా ఒకటి. సాహో దర్శకుడు సుజిత్ చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే .

“ఒరిజినల్ గ్యాంగ్ స్టార్” టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది . ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించబోతున్నాడు .. ఎలాంటి లుక్స్ లో మనల్ని ఆకట్టుకోబోతున్నాడు అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే షూటింగ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రజెంట్ పవన్ లేని పోర్షన్స్ ని షూట్ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ఇంపార్టెంట్ సీన్స్ ను చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం ముంబైలో ప్రీ ఇంటర్వెల్ సంబంధించిన కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నాడట . ఇలాంటి క్రమంలోని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పై ఓ క్రేజీ అప్డేట్ మీడియాలో లీకై వైరల్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు గాంధీ అంటూ తెలుస్తుంది. అసలు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రకి పేరుకి ఏం మ్యాచ్ కావడం లేదు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గాంధీ అనే పేరుని పెట్టడం ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ చర్చించుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!