అయ్యయ్యో..నాగార్జున కూడా “మంగళవారం” నేనా..? ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్..!!

పాపం తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచిందా ..? అన్నట్లు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి అస్సలు కలిసి రావట్లేదు.. వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతున్న అక్కినేని హీరోలు ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో కూడా ట్రోలింగ్ కి గురవుతున్నారు . భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది .

అక్కినేని అఖిల్ కనిపించకుండా పోయాడు . ఆ తర్వాత కస్టడీ సినిమా డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది . నాగచైతన్య అడ్రస్ లేకుండా పోయాడు. కాగా ఇప్పుడు అందరూ హోప్స్ నాగార్జున పైనే పెట్టుకుని ఉన్నాడు. నిజానికి నాగార్జున ఘోస్ట్ మూవీ తర్వాత ఏ సినిమాకి సైన్ చేయలేదు . ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ఆర్ఎక్స్ 100 సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన అజయ్ భూపతి రీసెంట్ గానే మంగళవారం అనే సినిమాను తెరకెక్కించి రిలీజ్ డేట్ ను రెడీ చేశారు .అయితే అజయ్ భూపతి ఇప్పుడు నాగార్జునతో సినిమా తీయబోతున్నాడు అని తెలిసి అది కూడా మంగళవారం సినిమాలాగే ఉంటుందా..? అంటూ జనాలు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు . ఘోస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది . ఈ సినిమాతో అయినా నాగార్జున అక్కినేని పరువును నిలబెడతాడేమో చూడాలి..?