“అలియా భట్ తో నా పెళ్లి నిజమే”.. గుండెలు పగిలిపోయే విషయాని చెప్పిన విజయ్ వర్మ..!!

ప్రజెంట్ సినిమాలో హీరోయిన్ తమన్నా పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో హాట్ వెబ్ సిరీస్ లో నటిస్తూ తమన్నా బోల్డ్ సీన్స్ లో బోల్డ్ కంటెంట్ లో నటిస్తూ ఉండడం అభిమానులకి మింగుడు పడడం లేదు. ఇలాంటి క్రమంలోనే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతున్నాను అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది .

కాగా ఇలాంటి టైం లోనే విజయ్ వర్మ కు ఆల్రెడీ పెళ్లయింది అని.. చెప్పడానికి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తో విజయ్ వర్మ పెళ్లిలో దిగిన ఫోటో ఆయన ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని ఉండడం హాట్ టాపిక్గా ట్రెండ్ అయింది . దీనిపై నానారకాల వార్తలు వైరల్ అయ్యాయి . దీంతో స్పందించిన విజయ్ వర్మ “అది డార్లింగ్స్ సినిమా టైంలో నేను అలియా భట్ దిగిన ఫోటో అని ..మేకర్స్ మా ఇద్దరికీ పెళ్లి చేసి ఆ ఫోటో తీశారని ..ఇది మొత్తం సినిమాలో భాగంగానే జరిగింది అని.. దీన్ని తప్పుగా ఎవరు తీసుకోవద్దు ” అంటూ క్లారిటీ ఇచ్చాడు .

దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే విజయ్ వర్మ రిప్లై ఇచ్చేసరికి తమన్న ఫ్యాన్స్ ఈ ఫోటో పై మండిపడ్డారు. తమన్న ని రెండో పెళ్లి చేసుకుంటున్నావా..? బుద్ధి లేదా..? సిగ్గు లేదా..? అంటూ ఘాటుగా స్పందించారు. జరగాల్సిన నష్టం అంత జరిగిపోయాక క్లారిటీ ఇచ్చిన విజయ్ వర్మ ప్రయోజనం లేకుండా పోయింది..!!