ప్రభాస్ ని పెళ్లి చేసుకోమని..అనుష్కను ఆ డైరెక్టర్ ఫోర్స్ చేస్తున్నాడా..? వెనుక ఇంత కన్నింగ్ ప్లానా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఎన్ని గాసిప్లు వస్తున్నా సరే ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ గాసిప్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా రెబల్ హీరో ప్రభాస్,, హీరోయిన్ అనుష్కల పెళ్లి మ్యాటర్ . వీళ్లు పెళ్లి చేసుకుంటారో లేదో ఆ దేవుడికి తెలియాలి.. కానీ వీళ్ళు పెళ్లి చేసుకోవాలని.. చేసుకుంటే చూడాలి అని కోట్లాదిమంది అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీలు వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే వీళ్ళ పెళ్లికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో లేటెస్ట్ గా ఓ స్టార్ డైరెక్టర్ అనుష్కను ప్రభాస్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాడు అన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ – అనుష్క పలు మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు .

ఈ క్రమంలోనే బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో డైరెక్టర్ – ప్రొడ్యూసర్ – నటుడు కరణ్ జోహార్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ క్రమంలోనే కరణ్ జోహార్ తన పర్సనల్ విషయాలను కూడా గెలికాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . “అనుష్కతో పర్సనల్గా ప్రభాస్ అంటే మీకు ఇష్టం ఉంటే నేను మాట్లాడతాను.. నేను ఒప్పిస్తాను మీ జంట బావుంటుంది “అంటూ లేనిపోని విధంగా ట్రై చేశారట .

అంతేకాదు తెలివిగల అనుష్క ఎక్కడ కూడా టంగ్ స్లిప్ అవ్వలేదట . “ప్రభాస్ నేను ఫ్రెండ్స్ ..జస్ట్ అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రూమర్ ” అంటూ కొట్టి పడేసిందట . అయితే అనుష్కకు ప్రభాస్ అంటే ఇష్టం ఉన్నా కానీ అతగాడు ఇన్వాల్వ్మెంట్ ఇష్టం లేక కరణ్ జోహార్ కు అలా చెప్పింది అన్న కామెంట్స్ ప్రభాస్ అభిమానులు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్కల పెళ్లి మ్యాటర్ మరోసారి వైరల్ గా మారింది..!!