30 సెకండ్ల‌ యాడ్ కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

టైగర్ ఎన్టీఆర్ ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతూనే మరోవైపు పలు టాప్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటిస్తున్నాడు. నేషనల్ వైడ్ గా ఎంతో ప్రఖ్యాతి గాంచిన మెక్ డొనాల్డ్స్ సంస్థ రీసెంట్ గా తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ను నియ‌మించుకుంది.

తాజాగా మెక్ డొనాల్డ్స్ యాడ్ లో కూడా ఎన్టీఆర్ న‌టించాడు. రెండు రోజుల క్రితం బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ యాడ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే 30 సెకండ్స్ ఉన్న ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే, మెక్ డొనాల్డ్స్ యాడ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ. 8 కోట్లు ఛార్జ్ చేశాడ‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో అందరి కంటే హైయెస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ అని కూడా చ‌ర్చించుకుంటున్నారు. కాగా, ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ‌ర‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డిఫరెంట్ క్యారెక్ట‌ర్ లో అల‌రించ‌నున్నాడు.