నాకు ఏడు సార్లు పెళ్లి చేశారు.. చాలా ఇబ్బంది ప‌డ్డానంటూ బిగ్ బాంబ్ పేల్చిన అవికా గోర్‌!

అవికా గోర్‌.. ఈ ముంబై ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `బాలికా వధూ(చిన్నారి పెళ్లికూతురు)` సీర‌య‌ల్ ద్వారా దేశ‌వ్యాప్తంగా పాపుల‌రిటీని సంపాదించుకున్న అవికా గోర్‌.. అనేక టీవీ సీరియ‌ల్స్ లో న‌టించింది. అలాగే `ఉయ్యాల జంపాలా`తో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, స్టార్ హోదా ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొన‌సాగిస్తున్న అవికా గోర్‌.. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న‌కు ఏడు సార్లు పెళ్లి చేశారంటూ బిగ్ బాంబ్ పేల్చింది. అయితే అవికాకు పెళ్లి చేసింది రియ‌ల్ గా కాదండోయ్.. రీల్‌గానే. తాజా ఇంట‌ర్వ్యూలో తాను న‌టించిన `ససురాల్ సీమర్ కా` అనే సీరియల్ గురించి ప్ర‌స్తావిస్తూ అవికా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ససురాల్ సీమర్ కా సీరియ‌ల్ లో కొన్ని సన్నివేశాలు తానే చాలా ఇబ్బంది ప‌డ్డాన‌ని, అవి వాస్తవానికి దూరంగా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. `ఈ సీరియ‌ల్ లో నాకు ఏకంగా ఏడు సార్లు పెళ్లి చేశారు. మూడుసార్లు హీరోతో మరో నాలుగు సార్లు ఇతర క్యారెక్టర్స్ తో పెళ్లి చేశారు. అలాగే మూడుసార్లు నేను చనిపోయి బ్రతికినట్లు చూపించారు. ఆత్మలతో మాట్లాడుతున్నట్లు చూపించారు. ఆ సీన్స్ తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది` అని అవికా గోర్ చెప్పుకొచ్చింది. అలాగే సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. స్టార్ పవర్ అంటేనే సౌత్. సౌత్ లో స్టార్స్ మీదే సినిమాలు నడుస్తాయి. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో నెపోటిజం చాలా ఎక్కువ అంటూ అవికా గోర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.