బిగ్ బాస్ కోసం కమల్ హాసన్ మైండ్ బ్లోయింగ్ రెమ్యూనరేషన్.. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్..!!

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాష – భేదం తేడా లేకుండా హ్యూజ్ పాపులారిటి తో దూసుకుపోతున్న బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది అంటేనే అభిమానుల్లో తెలియని క్యూరియాసిటీ ..ఆనందం.. అమాయకత్వం .. ఆందోళన అన్ని నెలకొంటున్నాయి. కాగా త్వరలోనే తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది . అయితే తెలుగులో ఇన్నాళ్లు హోస్టుగా చేసిన నాగార్జున ఈసారి ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.

అంతే కాదు.. ఆయన ప్లేస్ లో రానా దగ్గుబాటి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే తమిళ్ బిగ్ బాస్ ఏడవ సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈసారి కూడా తమిళ్ బిగ్ బాస్ కి హోస్టుగా కమలహాసన్ చేస్తున్నారట . అయితే ఇప్పటి వరకు ఎవ్వరు చేయని సాహసాన్ని కమలహాసన్ చేస్తున్నట్లు తెలుస్తుంది . ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కోసం ఏకంగా 130 కోట్లు పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నారట కమల్ హాసన్ .

దానికి కారణం ఆయన నటించిన విక్రమ్ సినిమా హిట్ అవ్వడం .. త్వరలోనే ప్రాజెక్టు కే సినిమాలో విలన్ గా పోషిస్తూ ఉండడంతో.. క్రేజ్ దృష్ట్యా కమలహాసన్ ఇంత డిమాండ్ చేస్తున్నారట . అయితే మేకర్స్ సైతం ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం గమనార్హం. ఇదే న్యూస్ ప్రెసెంట్ చెన్నై ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది . ప్రజెంట్ కమల్ హాసన్ ఇండియన్ టు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు . ఆ తర్వాత ప్రాజెక్ట్ కె షూటింగ్లో భాగం కానున్నారు..!!