ప్రి రిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ లియో..!!

లియో : కోలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్నారు విజయ్.. వీళ్ళిద్దరి కలయికలో గతంలో మాస్టర్ సినిమా విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కించే కథలు కూడా చాలా విభిన్నంగా ఉండడంతో పాటు .. ఒకదానితో మరొకటి లింక్ ఉండడంతో ప్రేక్షకులలో అంచనాలను పెంచేస్తున్నాయి.

LEO (2023) Tamil Movie
తాజాగా లియో సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి టీజర్ కూడా విడుదల కాకుండానే బడ్జెట్ డబుల్ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లియో సినిమా సాటిలైట్ డిజిటల్ అండ్ మ్యూజిక్ రైట్స్ దాదాపుగా రూ .220 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు కోలీవుడ్ మీడియా వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే రేంజిలో ఈ సినిమా థియేటర్ రైట్స్ కూడా సెటిల్ అయినట్లుగా సమాచారం.

గతంలో తెలుగులో వారసుడు సినిమా రూ.18 కోట్లు అమ్ముడు పోగా తాజాగా లియో సినిమా ఏకంగా రూ .25 కోట్ల రూపాయలు పరికినట్లు సమాచారం. కేరళలో రూ.15 కోట్లు కనడాలో రూ.12 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయినట్లు సమాచారం. తమిళంలో ఈ సినిమా సెవెన్ స్క్రీన్ స్టూడియో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లియో సినిమా ప్రి రిలీజ్ బిజినెస్.. రూ.422 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా బడ్జెట్ కేవలం 250 కోట్ల రూపాయలు పైగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఈ సినిమా డబుల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం మరి ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.