టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నాకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. చలో సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది . ఆ తరువాత తనదైన స్టైల్ లో నటిస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా దూసుకుపోయిన రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా మారిపోయి పుష్ప సినిమాతో పాన్ ఇండియా లవెల్లో పాపులారిటీ దక్కించుకుంది .
అయితే అంతటి క్రేజ్ పాపులారిటీ వచ్చిన ఎందుకో సోషల్ మీడియాలో రష్మిక మందన పేరు ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. ఇలాంటి క్రమంలోనే పోయిన మంచి పేరుని మళ్లీ తెచ్చుకోవడానికి రష్మిక మందన్నా ఐటమ్ సాంగ్ కూడా చేయడానికి సిద్ధపడింది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి . మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో రష్మిక మందన్నా ఐటమ్ సాంగ్ కి సెలక్ట్ అయ్యిందట.
అయితే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ కొత్త హీరోయిన్స్ పై మోజుపడిపోవడంతో రష్మికని ఈ సినిమా నుంచి తీసేసి మరో హీరోయిన్ ని ఆ పాత్రలో రీప్లేస్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అంతే అలర్ట్ అయిన రష్మిక మందన్నా త్రివిక్రమ్ కు కాల్ చేసి మరి తన ప్లేస్ ని కన్ఫామ్ చేసుకుందట . దీంతో రష్మిక ఇంతకు తెగించేసిందా ..? డైరెక్టర్లకు కాల్ చేసి మరి ఆఫర్స్ అడుగుతుందా ..? అంటూ షాక్ అయిపోతున్నారు అభిమానులు . దీంతో రష్మిక మందన్నా పేరు మరోసారి వైరల్ గా మారింది..!!