సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ..ఎలాంటి ట్రోలింగ్కి గురవుతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన జి కర్దా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి తమన్నా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే ఆమె ఈ సిరీస్లో హాట్ హాట్ గా నటించడం టాప్ తీసి బోల్డ్ గా రొమాన్స్ చేయడం వైరల్ అవుతుంది.
కాగ రీసెంట్గా లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ. తాను జీకర్ద వెబ్ సిరీస్ లో ఎందుకు బోల్డ్ కంటెంట్ ఇవ్వాల్సి వచ్చిందో అనేదానిపై క్లారిటీ ఇచ్చింది . ఈ క్రమంలోనే తమన్నా మాట్లాడుతూ..” నేను జి కర్ధా వెబ్ సిరీస్ లో లిప్ లాక్ సీన్స్ ..బెడ్ సీన్స్ చేయడం పై చాలా వల్గర్ ట్రోల్ చేస్తున్నారు. అదే ఓ స్టార్ హీరో బూతు మాటలు మాట్లాడిన ..బూతు డైలాగ్ చెప్పిన క్లాప్స్ కొడతారు . మరి నన్నెందుకు ఇలాంటి ట్రోల్ చేస్తున్నారు”.
” ఆడవాళ్లను ఒకలాగా .. మగవాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయకండి ..ఇన్నాళ్ళ నా కెరియర్ లో ఫస్ట్ టైం నేను హద్దులు క్రాస్ చేశాను. దానికి కారణం కూడా ఉంది . నటి అన్నాక ఎలాంటి రోల్స్ అయిన చేయగలగాలి అనుకున్నాను . అందుకే చేశాను . ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతే అందరికీ మంచిది ” అంటూ బోల్డ్ గా స్పందించింది..!!