ఉపాసన ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన..చరణ్ పాప విషయంలో జరిగేది అదే….తేల్చేసిన చిరంజీవి..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసి మెగా మనవరాలు మెగా ప్రిన్సెస్ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ పదేళ్ల తర్వాత తన ఫస్ట్ బేబీకి వెల్కమ్ చేశారు. ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. జూన్ 20న 1 : 49 నిమిషాలకు పండు లాంటి పాపకు జన్మనిచ్చింది ఉపాసన . ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన మనవరాలు పుట్టింది అన్న సంతోషంలో ప్రెస్ మీట్ లో ఇంటి మహాలక్ష్మి గా అభివర్ణించారు.

అంతేకాదు మా ఇంట్లో జరిగే శుభకార్యాలకు చరణ్ కూతురే కారణమంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు . ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పాప విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . వేణు స్వామిని ఇంటికి పిలిపించి ఆమె జాతకం చూపించాలి అని ..పరిహార పూజలు ఏమన్నా చేయించాలి అంటూ డిసైడ్ అయ్యారట . అయితే ఉపాసన చరణ్ మొదటి నుంచి జాతకాలు నమ్మరు .

ఈ సంగతి అందరికీ తెలిసిందే . అయితే ఉపాసన ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా.. చరణ్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా .. ఈ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతున్నాడట. వేణు స్వామి ఇంటికి పిలిపించి పాపకు ప్రత్యేక పూజలు చేయించాలని డిసైడ్ అయ్యారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!