టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత తన క్రేజ్ ని పాపులారిటీను పాన్ ఇండియా లవెల్లో మారు మ్రోగిపోయేలా చేసుకుంటున్న ప్రభాస్.. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాను చేశాడు.
జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ పరంగా నెగిటివ్ గా క్రియేట్ చేసుకున్న.. కలెక్షన్స్ పరంగా పాజిటివ్ రికార్డులను బద్దలు కొట్టింది . 450 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇలాంటి క్రమంలోనే మళ్లీ ఓం రావత్ ని నమ్మి ప్రభాస్ మరో సినిమాలో భాగం కానున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అయితే దీనిపై ఫ్యాన్స్ సముఖంగా లేరు అని తెలుస్తుంది . ఆల్రెడీ ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే తన పేరుని పెంట పెంట చేసేసాడు . మరో ఛాన్స్ ఇస్తే ఈసారి నట్టేట్లో ముంచడం పక్క అంటూ ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . చూడాలి మరి ప్రభాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..? ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ మరోసారి ఓం రావత్ తో కలిస్తే.. ఆయన గోతి ఆయనే తీసుకున్నట్లు..!!