నిఖిల్ స్పై మూవీ రివ్యూ..!!

తాజాగా నిఖిల్ నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై సినిమాని డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య స్పై సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ నటిస్తోంది.ఈ సినిమా ప్రమోషన్స్ని కూడా పెద్దగా చేయలేకపోయారు..కానీ ఇటీవల ట్రైలర్ విడుదలవ్వడంతో మంచి రెస్పాన్స్ లభించింది.ఒక గూఢచారి కథ అన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

SPY Telugu Movie Review, USA Premiere Report
ఇక ముందుగానే యూఎస్ఏ లో స్పై సినిమా ప్రీమియర్ షోలు మొదలయ్యాయి దీంతో స్పై చిత్రానికి సంబంధించి పలు రిపోర్ట్ లు కూడా రావడం జరిగింది.. స్పై మూవీ రా ఏజెన్సీకి సంబంధించిన పలు కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుందట.ఒక్కొక్క ఏజెంట్ పాత్ర అని పరిచయం చేస్తూ వారి యొక్క పనిని ఫిక్స్ చేస్తూ ఉండేలా పాత్రలను చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా ప్రారంభంలోనే ప్రతి ఏజెంట్ ఎందుకోసం చేస్తున్నారు అర్థమవుతుంది. అయితే ఈ సినిమా ప్రారంభంలో చాలా గ్రాండ్గా మొదలైనప్పటికీ ఆ తర్వాత రొటీన్గా స్పై అంశాలతో చాలా నిరాశపరిచినట్లు తెలుస్తోంది.

ఇక సుభాష్ చంద్రబోస్ అదృశ్యం గురించి కొన్ని అంశాలను ఇంట్రెస్ట్ గా చూపించడం జరిగిందట.సుభాష్ చంద్రబోస్ చుట్టూ ఏం జరిగింది అని ఆసక్తిని కూడా పెంచగలిగారు కథలో ప్రధానంగా ఆసక్తి కలిగించే అంశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్వెల్ ముందు ఈ సినిమాని ఆసక్తిని పెంచేలా చేశారు. అయితే మొదటి భాగంలో చెప్పుకోదగ్గ మూమెంట్స్ లేవని వార్తలు వినిపిస్తున్నాయి. నిఖిల్ మాత్రం రా ఏజెంట్గా అదరగొట్టేసారని సమాచారం. కథపరంగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇందులో ఎక్కడా కూడా హైపునిచ్చే సన్నివేశాలు కనిపించలేదట. సెకండ్ పార్టీలో సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని సన్నివేశాలు బాగున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ బిజిఎం బాగానే వర్కౌట్ అయిందని తెలుస్తోంది.. ఈ చిత్రంలో నిఖిల్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు.. ఓవరాల్ గా ఈ సినిమా పర్వాలేదు అన్నట్లుగా తెలుస్తోంది.