చిరంజీవి-హీరోయిన్ త్రిష మధ్య విభేదాలు ఉన్నాయా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శక నిర్మాతలు నటీనటుల సైతం ఇప్పటికీ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరోయిన్ త్రిష- చిరంజీవి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి దాదాపుగా 17 సంవత్సరాలు పట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Go Go Goa Full Song |Stalin||Chiranjeevi , Mani Sharma Hits | Aditya Music  - YouTube
హీరోయిన్ల కెరియర్ విషయానికి వస్తే చాలా తక్కువ సమయంలోనే ఫెడవుట్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.కానీ 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఏకైక హీరోయిన్ త్రిష అని చెప్పవచ్చు. అదే అందంతో అదే ఫిట్నెస్ తో తన కెరీర్ ని ముందుకు తీసుకు వెళ్తోంది. కెరియర్ ప్రారంభం నుంచి తమిళం కన్నా ఎక్కువగా తెలుగులోనే సినిమాలే చేసి మంచి క్రేజీ సంపాదించింది త్రిష.. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్స్ హీరోలతో నటించింది. చిరంజీవితో కలిసి 17 సంవత్సరాల క్రితం స్టాలిన్ సినిమాలో నటించింది త్రిష.

స్టాలిన్ సినిమా తర్వాత చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.. ఆ వెంటనే ఆచార్య సినిమాలో హీరోయిన్గా త్రిషని తీసుకుందామని అనుకోగా ఆ సమయంలో చిరంజీవి, త్రిష మధ్య రెమ్యూనరేషన్ విషయంలో మనస్పర్ధలు వచ్చి ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం..అప్పటి నుంచి త్రిష, చిరంజీవి మధ్య దూరం పెరిగిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మళ్లీ 17 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. భోళా శంకర్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ ఉండబోతున్నట్లు సమాచారం.