నాలుగేళ్ల జోష్ లేదే..టీడీపీపైనే ఫోకస్.!

వైసీపీ అధికారంలోకి వచ్చి…జగన్ సీఎంగా ప్రమాణం చేసి పాలన మొదలుపెట్టి సరిగ్గా నాలుగేళ్ళు అవుతుంది. అయితే ఎప్పటికప్పుడు జగన్ అద్భుతమైన పాలన చేస్తున్నారని, పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని, కానీ ప్రతిపక్షాలు జగన్ పై బురదజల్లుతున్నాయని, కాబట్టి ప్రజలే జగన్‌కు అండగా ఉండాలని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అసలు ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని అంటున్నారు.

అయితే అంతా బాగానే ఉంది. నాలుగేళ్ల పాలనకు సంబంధించి వైసీపీలో మాత్రం జోష్ కనిపించడం లేదు. గతంలో రెండేళ్లకు, మూడేళ్లకు సంబరాలు చేసుకున్నారు గాని..ఈ నాలుగేళ్ల సంబరం మాత్రం కనబడలేదు. కనీసం ఈ నాలుగేళ్ల పాలన గురించి మంత్రులు సైతం మీడియా ముందుకొచ్చి చెప్పుకున్నది లేదు. ఏదో సజ్జల లాంటి వారి చెప్పడం తప్ప. కానీ జగన్ మాత్రం ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు.  ‘దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. నాపై ఎంతో నమ్మకంతో మీరు(ప్రజలు) ఈ బాధ్యతను అప్పగించారు’ అని ట్వీట్ చేశారు.

ఈ నాలుగేళ్లలో తామేం సాధించిందీ చెప్పుకోవడానికి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీకి, ప్రభుత్వానికి ఇదే సరైన సమయం. కానీ ఎక్కడ కూడా వైసీపీ శ్రేణులు నాలుగేళ్ల సంబరాలు చేసుకోలేదు..జిల్లాల్లో గాని, నియోజకవర్గాల్లో గాని నాలుగేళ్ల పాలనని సెలబ్రేట్ చేసుకోలేదు. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

అంతే ప్రతి ఒక్కరూ టీడీపీపై విమర్శలు చేసే పనిలోనే ఉన్నారు. టి‌డి‌పి విడుదల చేసిన మేనిఫెస్టోనే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు తప్ప..ఈ నాలుగేళ్లలో తాము ఏం చేశామో మాత్రం చెప్పుకోలేదు.eeeeeee