హీరో చిరంజీవి అని తెలిసి..భోళా శంకర్ సినిమాలో తమన్నా పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవితో సినిమాలు తీయాలి అని.. చిరంజీవి నటించిన సినిమాల్లో నటించాలని అందరికీ ఉంటుంది . ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే 90% మంది జనాభా ఎప్పుడెప్పుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుందామా అనే వెయిట్ చేస్తూ ఉంటారు . అలాంటి ఒక్క క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . అయితే ఓ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు అని తెలిసి స్టార్ హీరోయిన్ ఆ సినిమాను రిజెక్ట్ చేసిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా “భోళాశంకర్”. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆయన చెల్లెలుగా నటిస్తూ ఉండగా ..తమన్న ఆయనకు జోడిగా నటిస్తుంది . అయితే ఈ సినిమాలో తమన్నాకి ముందు అనుకున్న హీరోయిన్ నయనతార అంటూ తెలుస్తుంది .

చిరంజీవి – నయనతార కాంభో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పర్ఫెక్ట్ జోడీ అనే చెప్పాలి . అయితే ఆల్రెడీ గాడ్ ఫాదర్ సినిమాలో ఆయనకు సిస్టర్ రోల్ లో నటించిన నయనతార మళ్ళీ వెంటనే ఆయనకు జోడిగా నటిస్తే బాగోదు అని భావించి నయనతార ఈ సినిమా స్క్రిప్ట్ విని బాగున్న హీరో చిరంజీవి అని తెలిసి రిజెక్ట్ చేసిందట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైన నయన్ కంటే చిరు పక్కన్న తమన్నా నే బాగుంటుంది అంటున్నారు జనాలు..!!