ప్రభాస్ సినిమాలో కమలహాసన్ విలన్.. బొమ్మ బ్లాక్ బస్టరే..!!

ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలలో ప్రాజెక్ట్-k కూడా ఒకటి. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, నటుడు అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల అప్డేట్లను అభిమానులను చాలా ఆసక్తికి గురయ్యేలా చేస్తోంది.

Tamil Actor Kamal Haasan Villan In Prabhas Project K Movie ரூ150 கோடி சம்பளம் பேசுவதாக தகவல்: பிரபாஸுக்கு வில்லனாக கமல்ஹாசன்? | Indian Express Tamil
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కమలహాసన్ కూడా విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటివరకు ఊహించని విధంగా ఉండబోతుందని ఈ చిత్రంలో కమలహాసన్ పాత్ర మరింత హైలైట్ గా కాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలోని కమల్ హాసన్ పాత్ర కోసం ఏకంగా రూ .150 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు

కమలహాసన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని విలన్ రోల్ చేయడానికి కమలహాసన్ సైతం ఒప్పుకున్నట్లుగా సమాచారం. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఆ మారుతుంది ప్రభాస్ సినిమాలో కమలహాసన్ భాగమవుతూ ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మొదటిసారి ప్రతి నాయకుడుగా కమలహాసన్ నటించిన ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. కమలహాసన్ ఓటీటి ల గురించి మాట్లాడుతూ ఓటీటి ల గురించి తాను కొన్ని సంవత్సరాల ముందే చెప్పానని.. ఆ సమయంలో ఇండస్ట్రీలోని వారెవరు తన మాటలు పట్టించుకోలేదని ఇప్పుడు తన ఆలోచనలు అంగీకరించలేదని ఈరోజు వారికి అర్థమయింది అంటూ తెలియజేశారు.