వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్స్ చేయడానికి కారణం..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారిన హీరోయిన్ ఎవరంటే వరలక్ష్మి శరత్ కుమార్ అని చెప్పవచ్చు.. ఇలా చేయడం అంటే అది మామూలు విషయం కాదు.. అందం, అభినయం మంచి పర్సనాలిటీ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా నెగిటివ్ పాత్రలలో నటించి సక్సెస్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్.ఇలా నెగిటివ్ షేడ్ పాత్రలను ఎందుకు ఎంచుకుందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.

Varalaxmi Sarath Kumar to shift her base to Hyderabad; details inside |  Telugu Movie News - Times of India
వరలక్ష్మి శరత్ కుమార్ మొదట్లో ఒక స్టార్ హీరోయిన్గా కోలీవుడ్లో గుర్తింపు సంపాదించింది. అయితే కొన్ని సినిమాలలో నటించగా అందులో సక్సెస్ కంటే ఎక్కువగా ఫ్లాపులని తెచ్చిపెట్టాయి. దీంతో హీరోయిన్గా ఈమెకు అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో హీరోయిన్గా కలిసి రాలేదని నెగిటివ్ పాత్రలు చేయాలని ఫిక్స్ అయింది. నెగిటివ్ పాత్రలో నటిస్తూ హీరోయిన్ గా కంటే ఎక్కువగానే పాపులారిటీ సంపాదించింది. దీంతో చాలామంది ఈమెను హీరోయిన్గా చూడడానికి అంటే ఇలా నెగటివ్ పాత్రలో చూడడానికి ఎక్కువ ఇష్టపడడంతో అభిమానుల కోరిక మేరకు ఈమె ఎక్కువగా నెగటివ్ పాత్రలోనే నటిస్తోందని సమాచారం.

ఈ విషయంపై గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ నెగిటివ్ పాత్రలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నించగా ..ఇందుకు వరలక్ష్మి స్పందిస్తూ హీరోయిన్ కావాలంటే గ్లామర్ పాత్రలలో చాలా పోషించాలి గ్లామర్ పరంగా బాగా టాలెంట్ చూపిస్తూ ఉండాలి. అలా అయితేనే హీరోయిన్గా కొనసాగ గలం లేకపోతే కష్టమే అందుకే అటువంటి తలనొప్పులు నేను పెట్టుకోలేక నెగిటివ్ పాత్రలలో చేస్తున్నానంటూ తెలియజేసినట్లు సమాచారం.. ముఖ్యంగా ఈమె కెరియర్ లో క్రాక్, నాంది వీరసింహారెడ్డి, యశోద వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది.