వచ్చే ఎన్నికల్లో మంత్రులు ఎంతమంది గెలుస్తారా? వైసీపీ మంత్రులు మళ్ళీ ఎవరు గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టంగానే ఉంది. అయితే 25 మంది మంత్రుల్లో సగం పైనే గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. కానీ గత టిడిపి హయాంలో పనిచేసిన మంత్రులు కంటే..ఇప్పుడు వైసీపీ హయాంలో పనిచేసే మంత్రులు బెటర్ పొజిషన్ లో ఉన్నారు. గతంలో మంత్రులుగా చేసిన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే మళ్ళీ గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మాత్రమే మళ్ళీ గెలిచారు.
కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో మంత్రులుగా చేస్తున్న వారిలో ఎక్కువ మందే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో 25 మంది మంత్రులు ఉన్నారు. అందులో 10 మంది వరకు మళ్ళీ గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. అలా గెలుపు అవకాశాలు ఉన్న వారిలో ముందు వరుసలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు..పుంగనూరులో ఈయనకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు డోన్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సైతం గెలుపు ఛాన్స్ ఉంది.
ఇక కడప సిటీలో అంజాద్ బాషాకు గెలుపు అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. కడప వైసీపీ కంచుకోటగా ఉండటంతో అంజాద్ గెలుపు సులువే. ఇటు సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సైతం కాస్త గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ సైతం మళ్ళీ గట్టెక్కేలా ఉన్నారు. కానీ ఇటీవల ఆయన కాస్త నెగిటివ్ చేసుకున్నారు. ఇక గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంత్రులకు అంతగా అవకాశాలు కనిపించడం లేదు.
ఇటు తునిలో మంత్రి దాడిశెట్టి రాజాకు బలం అలాగే ఉంది..అక్కడ ఇంకా టిడిపి బలపడలేదు కాబట్టి…దాడిశెట్టికి ఇబ్బంది లేదు. ఇక మాడుగులలో మంత్రి బూడి ముత్యాలనాయుడుకు కాస్త ఛాన్స్ ఉంది..కానీ అది టఫ్ ఛాన్స్. ఇక చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, సాలూరులో రాజన్న దొరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి.