మ‌రోసారి జంట‌గా చిక్కిన‌ విజ‌య్‌-ర‌ష్మిక‌.. బ్రేక‌ప్ వార్త‌ల‌కు ఇలా చెక్ పెట్టారా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన్నా మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. వెండితెర‌పై రష్మిక విజయ్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్‌, రష్మిక రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారని ప్రచారం ఊపందుకుంది.

విజ‌య్‌-ర‌ష్మిక క‌లిసి వెకేషన్స్ కు వెళ్లడం, వీలుచిక్కినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరగడం, డిన్న‌ర్ డేట్స్ కు వెళ్ల‌డం వంటి అంశాలు నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. అయితే ఈ మధ్య విజయ్, రష్మిక బ్రేకప్ చెప్పుకున్నార‌ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్త‌ల‌కు తాజాగా చెక్ పెట్టారు. మరోసారి ఈ ప్రేమ పక్షులు జంటగా మీడియాకు చిక్కారు.

హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని ఓ కాఫీ షాపులో విజయ్-రష్మిక సందడి చేశారు. వీరిద్దరూ కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యారు. వీరితో పాటు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా జాయిన్ కావడం విశేషం. ఇక విజయ్-రష్మిక మరోసారి కలిసి కనిపించడంతో వీరి డేటింగ్ ఊహాగానాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాగా, విజ‌య్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని గౌత‌మ్ ను చేస్తున్నారు. ఇందులో శ్రీ‌లీల హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ ప్రాజెక్ట్ బుధవారం పూజా కార్య‌క్ర‌మాల‌తో స్టార్ట్ అయింది.