విశాఖలో కాపురం..ఉత్తరాంధ్ర కలిసొచ్చేలా లేదుగా.!

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ మూడేళ్ళ క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు ఒక్క రాజధానికే దిక్కు లేదనే పరిస్తితి. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అనే తెలియనే పరిస్తితి. అలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. అయితే త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని, అదే ఏపీ రాజధాని అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు.

ఈ మాట చాలా రోజులు నుంచి చెబుతున్నారు. సి‌ఎం జగన్ సైతం పదే పదే విశాఖ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ మధ్య సెప్టెంబర్ నుంచే విశాఖలో కాపురం పెడతామని చెబుతున్నారు. తాజాగా విశాఖలో పలు పనులకు శంఖుస్థానపలు చేసిన జగన్..మీ బిడ్డ సెప్టెంబర్ నుంచే విశాఖలో కాపురం పెడతాడని ఓ సెంటిమెంట్ డైలాగ్ వదిలారు. అయితే విశాఖ నుంచి జగన్ పాలన మొదలుపెడతానని చెబుతున్నా సరే అక్కడి ప్రజలు అంతగా నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజల నుంచి పెద్దగా రియాక్షన్ రావడం లేదు.

పైగా చంద్రబాబుపై కక్షతో అమరావతి నుంచి విశాఖకు వస్తున్నారని, మళ్ళీ ప్రభుత్వం మారితే రాజధాని మారిపోతుందని, అయినా తమకు రాజధాని కంటే..విశాఖలో పెట్టుబడులు తీసుకొచ్చి..దేశంలో పెద్ద నగరాలకు పోటీగా నిలపాలని కోరుకుంటున్నారు. రాజధాని కంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు. పైగా రాజధాని పేరుతో వైసీపీ భూ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తోడు అదనంగా ట్రాఫిక్ సమస్యలు తప్ప విశాఖకు ఒరిగేది ఏమి లేదని అంటున్నారు.

అందుకే విశాఖకు వస్తానని జగన్ చెబుతున్నా సరే అక్కడి ప్రజలు పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. ఎన్నికల ముందు విశాఖకు వచ్చి ఉత్తరాంధ్రలో లబ్ది పొందాలనే కాన్సెప్ట్ జగన్‌ది అని, కానీ ఆ పరిస్తితి మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది.