చిరంజీవి బుద్ధి బ‌య‌ట‌పెట్టిన ఖుష్బూ.. హాట్ టాపిక్ గా మారిన న‌టి కామెంట్స్‌!

సీనియర్ నటి ఖుష్బూ ప్రస్తుతం `రామబాణం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెర‌కెక్కిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల‌ను పోషించారు. మే 5న‌ ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆయ‌న బుద్ధి బ‌య‌ట‌పెట్టింది. `చిరంజీవి ఒక‌ లెజెండ్‌. మానవత్వం కలిగిన వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయ‌న‌ది. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. కొత్తది చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు` అంటూ ఖుష్బూ చిరు గురించి గొప్ప‌గా చెప్పుకొచ్చింది.

అంతేకాదు, చిరంజీవితో రొమాన్స్ చేయాల‌నుంది అంటూ మ‌న‌సులో కోరిక‌ను కూడా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. స్టాలిన్‌లో ఆయనకు సిస్టర్ క్యారెక్టర్ లో న‌టించాన‌ని, కానీ మంచి స్క్రిప్ట్ దొరికితే చిరుతో రొమాన్స్ చేస్తానంటూ పేర్కొంది. మెచ్యూర్‌ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది. అదే నా కల అని ఖుష్బూ తెలిపారు. దీంతో ఖుష్బూ కామెంట్స్ కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

Share post:

Latest