`క‌స్ట‌డీ` కథ మొత్తం చెప్పేసిన డైరెక్ట‌ర్‌.. చైతూకి హిట్ ప‌డేనా?

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మ‌రికొద్ది రోజుల్లో `క‌స్ట‌డీ` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది.

అరవింద్ స్వామి, శరత్‌కుమార్, ప్రియ‌మ‌ణి, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌స్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర టీమ్ మీడియాతో ఇంట్రాక్ట్ అయింది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు క‌స్ట‌డీ క‌థ మొత్తం చెప్పేశారు.

`48 గంటల్లో జరిగే యాక్ష‌న్ డ్రామా మూవీ ఇది. ఒక్క లైన్ లో కథ చెప్పాలంటే, ఇందులో విలన్ చనిపోకుండా హీరో చూసుకోవాలి. ఛాన్స్ దొరికితే ఒకరినొకరు చంపుకోవాలని అనుకునేంత కోపం ఉంటుంది. కానీ, హీరోకి విలన్ ని ప్రొటెక్ట్ చేయడం తప్ప వేరే ఛాయిస్ ఉండ‌దు. కథంతా 2 రోజుల్లో జరుగుతుంది. అందువ‌ల్ల సినిమా మొత్తం హీరోహీరోయిన్లు కేవ‌లం రెండు కాస్ట్యూమ్స్ లోనే కనిపిస్తారు. ఇదొక ఇంటెన్స్ మూవీ.. ఫారిన్ సాంగ్స్, డ్రీమ్ సాంగ్స్ ఉండవు` అంటూ కస్టడీ మెయిన్ ప్లాట్ ఏంటో దర్శకుడు వెంకట్ ప్రభు రివీల్ చేశారు. మ‌రి ఈ సినిమా చైతూకి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Share post:

Latest