“నాగచైతన్య అలా..సమంత ఇలా”.. ప్రేమ కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా..?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా అక్కినేని హీరో నాగచైతన్య – హీరోయిన్ సమంత పెళ్లి మ్యాటర్ అనే చెప్పాలి . వీళ్లిద్దరూ ఏ ముహూర్తాన ప్రేమలో పడ్డారో తెలియదు కానీ అప్పటినుంచి వీళ్ళకి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . అయితే వీళ్ళు సినిమాలు చేస్తున్నప్పుడు …ప్రేమించుకున్నప్పుడు.. పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని న్యూస్లు వైరల్ అయ్యాయో తెలియదు కానీ …వీళ్ళు విడాకులు తీసుకున్నప్పటి నుంచి ప్రతి రోజు ఏదో ఒక వార్త వీళ్ళకి సంబంధించి వైరల్ అవుతూనే ఉంది .మరీ ముఖ్యంగా వీళ్ళు విడాకులు తీసుకొని దాదాపు సంవత్సరం దాటిపోయింది అయినా సరే ఇప్పటికి జంట కలవరా..? కలవక పోతారా..? అంటూ జనాలు వెయిట్ చేస్తున్నారు.

కాగా రీసెంట్గా “కస్టడీ” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య పరోక్షకంగా సమంత విడాకులపై కౌంటర్ వేశాడు. హోస్స్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా “మీరు జీవితంలో పశ్చాతాప పడిన సందర్భాలు ఉన్నాయా..? అంటే నో అన్నాడు”. అంతే కాదు “బాధపడిన మూమెంట్స్ ఉన్నాయా అంటే… రెండు మూడు సినిమాలు విషయంలో బాధపడ్డాను” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

ఇదే క్రమంలో నాగచైతన్య సింపుల్గా ఆన్సర్ ఇచ్చి అక్కడితో మ్యాటర్ కట్ చేశాడని ..అదే ఒకవేళ సమంతను అడుగుంటే దానికి పెద్ద స్టోరీ చెప్పి రాద్ధాంతాలు చేసి సరికొత్త మ్యాటర్స్ అల్లేసేది అంటూ అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . గతంలో సమంత ఎన్నో ఇంటర్వ్యూలలో నాగచైతన్య పై ప్రశ్నలు వేయగా.. ఎంత భారీ భారీ ఆన్సర్లు ఇచ్చి ఆ మ్యాటర్ ని సాగదీసిందో అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రేమ ఉన్నప్పుడు ఈ జంట ఒకలాగా.. ప్రేమ పోయాక మరోలా మాట్లాడుతుంది అంటూ పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేమకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా..? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. మరి మీరేమంటారు నిజంగానే ప్రేమకే ఎక్స్పైరీ డేట్ ఉందంటారా..?

 

Share post:

Latest