వారి వల్ల రూ .40 కోట్లు నష్టపోతున్న కంగాన రనౌత్..!!

టాలీవుడ్ లో మొదట ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కంగనా రనౌత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగు వేసి అక్కడ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో పలువురు పైన విమర్శలు చేస్తూనే ఉంటుంది.. దేశం ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వాళ్లను కూడా బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటుంది కంగనా రనౌత్ .. ముఖ్యంగా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటుంది.

Kangana Ranaut is back on Twitter after ban, netizens say 'welcome back  Iron Lady' | Entertainment News, Times Now
సినిమాలలో బిజీగా ఉన్న దేశంలోని పలు అంశాల పైన ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ వాటిపై సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు షేర్ చేస్తూనే ఉంటుంది.. తాజగా కంగనా రనౌత్ తన ఇంస్టాగ్రామ్ నుంచి ఒక ఆసక్తికరమైన స్టోరీని షేర్ చేసింది ఇటీవల ఎలాన్ మాస్క్.. నేను నాకిష్టమైతే చేశాను నేను నమ్మిన దానిపైన నిలబడతాను దానివల్ల డబ్బులు నష్టపోయిన పరవాలేదని అన్నాడు.. ఎలాన్ చేసిన వ్యాఖ్యలను తన స్టోరీలో షేర్ చేసుకుంది కంగనా రనౌత్ .

ఎలాంటి వ్యాఖ్యలను సపోర్టుగా నేను హిందుత్వం గురించి మాట్లాడటం వల్ల రాజకీయ నాయకులు దేశ వ్యతిరేకులకు తుక్కడే గ్యాంగ్ గురించి మాట్లాడడం వల్ల నాకు 20 నుంచి 25 బ్రాండ్ అంబాసిడర్లు పోయాయి రాత్రికి రాత్రే కొన్ని బ్రాండ్ల నుంచి తప్పించారు. కొన్ని సినిమాల నుంచి కూడా తప్పించారు. దీనివల్ల తనకు ఒక ఏడాదికి.. రూ.30 నుంచి రూ.40 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని.. కానీ నేను స్వేచ్ఛగా ఉన్నాను నాకు నచ్చింది మాట్లాడుతున్నాను భారతదేశాన్ని దేశ సంస్కృతిని వ్యతిరేకించే మల్టీ నేషనల్ కంపెనీలు వాటి హెడ్స్ కూడా నేను చెప్పాలనుకున్నది ఆపలేరు ఈ విషయంలో ఎలాన్ ని అభినందిస్తున్నాను అంటూ తెలిపింది.

Share post:

Latest