త‌మ‌న్నాకు బాగా బాధ క‌లిగితే ఏం చేస్తుందో తెలుసా.. డోర్స్‌ వేసుకుని మ‌రీ..?

సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.‌. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఓవైపు స్టార్ హీరోలతో జతకడుతూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తోంది. అలాగే అవకాశం వచ్చినప్పుడు ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తూ గట్టిగా సంపాదిస్తోంది.

ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవితో `భోళా శంకర్‌` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు జోడీగా `జైలర్` మూవీలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ఆగస్టులో ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా కెరీర్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే తనకు బాగా బాధ వ‌చ్చినప్పుడు మరియు బాగా సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తానో వివరించింది.

తమన్నాకు ఎక్కువ బాధ కలిగితే బాల్కనీలోకి వెళ్లి ప్రకృతిని చూస్తూ ఉంటుంద‌ట‌. తనను తాను మోటివేట్ చేసుకుంటూ బాధ‌ను తగ్గించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ట‌. ఇక అదే సంతోషం వస్తే రూమ్ డోర్స్‌ వేసుకుని ఫుల్ సౌండ్‌తో సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తుంద‌ట‌. త‌మన్నాకు డాన్స్ అంటే పిచ్చ ఇష్టమట. అందుకే సంతోషం వస్తే ఎనర్జీ మొత్తం అయిపోయే వరకు డ్యాన్స్ చేస్తానని తమన్నా చెప్పుకొచ్చింది.

Share post:

Latest