హీరోయిన్ శ్రీలీల లీలలు పనికొచ్చాయా? ఏకంగా నెంబర్ వన్ స్థానంపై కన్నేసిందా?

ఈ మధ్య కాలంలో తెలుగు పరిశ్రమలో బాగా వినబడుతున్న హీరోయిన్ పేరు శ్రీలీల. మొదటి సినిమా పెళ్లిసందడి 2 సినిమాతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన శ్రీ లీల అనతికాలంలోనే వరుస సినిమా ఛాన్సులు కొట్టేసి దూసుకుపోతుంది. ఎంతలా అంటే తనకన్నా అందమైనవారు, ప్రతిభగలవారు ఇక్కడ ఉన్నప్పటికీ శ్రీలీల ఎక్కువగా ఛాన్సులు కొట్టుకుపోవడం చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దాంతో శ్రీలీల లీలలు టాలీవుడ్లో బాగా పనికివస్తున్నాయని కొంతమంది గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.

అవును, తెలుగులో చేసిన రెండు సినిమాలతోనే ఆమె కాల్ సీట్ల కోసం ఇప్పుడు బడా హీరోల సైతం క్యూలో నుంచునే పరిస్థితి వచ్చింది. పూజా హెగ్డే, రష్మిక లాంటి టాప్ క్లాస్ భామలను కూడా కాదని ఈమె కోసం ఎదురుచూస్తున్నారంటే ఈమె హవా ఇక్కడ ఏ రేంజ్ లో ఉందో తేటతెల్లం అయిపోతుంది. ఇకపోతే ఎంతోమందిని బడా హీరోయిన్లను చిత్ర పరిశ్రమకు లంచ్ చేసిన కే రాఘవేంద్రరావు చేతితో లాంచ్ అయిన కారణంగా ఈ అమ్మడుకి అన్ని అవకాశాలు వస్తున్నాయని కొందరు అంటున్నారు.

విషయం ఏదైనప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ శ్రీలీల జపం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఆమె చేస్తున్న తాజా సినిమాలే కారణం. ప్రస్తుతం ఆమె ఏకంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రామ్, వైష్ణవ్ తేజ్ ఇలా బడాస్టార్లందరితోను సినిమాలు చేస్తూ మంచి స్వింగ్ లో వుంది. దాంతో ఇక ఇదే జోరు కొనసాగిస్తే టాలీవుడ్ నెంబర్ వన్ కిరీటం ఆమెదేనని నిరభ్యంతరంగా చెప్పవచ్చు. సినిమాలతో పాటు చదువులో కూడా ఆమె నెంబర్ వన్ అని తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.

Share post:

Latest