నీకు సినిమాలెందుకు? యంగ్ హీరో పరువు తీసిన డీజే టిల్లు!

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే.’ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలై, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ హీరో సిద్దూ జొన్నలగడ్డతో ఇంటర్వ్యూ ప్లాన్ చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.

సిద్దు జొన్నలగడ్డ గురించి తెలిసిందే. డీజే టిల్లు సినిమాతో మనోడు తెలుగునాట ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. దాంతో హీరో సిద్దూతో ఇంటర్వ్యూ చేస్తే సినిమాకు హైపు వస్తుంది అనుకున్న టీమ్ షురూ చేశారు. ఈ నేపథ్యంలో సిద్దు తన మాట తీరుతో డైలాగ్స్ వేయడంతో పాటు యూనిట్ పరువు ఒక్కసారిగా తీసేసాడు. ఈ సందర్భంలోనే సినిమా జానర్ గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ నందిని రెడ్డి పై సెటైర్లు వేసే క్రమంలో ‘లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ, కామెడీ, అంటున్నావేంటి ఇంకేమన్నా జానర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసి సినిమా చేసేలేకపోయారా? అంటూ వెటకారంగా మాట్లాడారు సిద్దు.

అనంతరం మాళవిక పై సెటైర్ వేస్తూ ‘నువ్వేంది! ఎప్పుడు ఒకేలాంటి పాత్రలు చేస్తావు?’ అంటూ ట్రోల్ చేశాడు. ఇలా మాట్లాడే క్రమంలో ఆమె చేసిన పాత్రలు అలా ఉంటాయి… ఇలా ఉంటాయి అంటూ కామెడీగా మాట్లాడాడు. చివర్లో మళ్ళీ అన్నీ మంచి శకునములే సినిమా కూడా అలాంటిదే అంటూ మరో సెటైర్ వేశాడు. ఇక హీరో సంతోష్ శోభన్ అయితే సిద్దు మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక బిక్క మొహం వేశాడు. అసలు నువ్వు మూవీస్ ఎందుకు చేస్తున్నావు? అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కొద్దిసేపు మౌనంగా ఉండి పోయాడు సంతోష్ శోభన్.

Share post:

Latest