త్రివిక్రమ్ – మహేష్ కాంబోకి పాతకాలపు టైటిల్… అభిమానులు ఊరుకుంటారా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న క్రేజీ కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించినప్పటినుండి ఈ సినిమాపైన అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల చివరిలో సదరు సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో ఈ సినిమా కోసం “అమరావతికి అటు ఇటు” అని టైటిల్ ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత “ఊరికి మొనగాడు” అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకప్పుడు ఊరికి మొనగాడు, ముగ్గురు మొనగాళ్లు, సోగ్గాడు పెళ్ళాం వంటి టైటిల్స్ తో సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాత కాలపు టైటిల్స్ తో వస్తే ప్రేక్షకులు పెదవి విరిచే అవకాశం వుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా టైటిల్ ఉండకుంటే కచ్చితంగా ప్రేక్షకుల నుండి తిరస్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని టాక్ వినబడుతోంది.

ఇకపోతే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే టైటిల్ అనేది సినిమాకు ఎంత అవసరమో అందరికీ తెల్సిందే. అలాంటిది గురూజీ ఆ టైటిల్స్ ని ఎలా నిర్ణయిస్తాడు అంటూ ఇపుడు ఘట్టమనేని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్న పరిస్థితి. ఊరికి మొనగాడు అనే టైటిల్ ని మహేష్ బాబు అభిమానులు కొందరు స్వాగతిస్తూ ఉంటే.. ఎక్కువ శాతం మంది మాత్రం తిరస్కరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రయోగాత్మక టైటిల్స్ అవసరం లేదని.. త్రివిక్రమ్ కి విజ్ఞప్తి చేస్తున్నారు కొంతమంది మహేష్ బాబు ఫాన్స్. మరి ఆ టైటిల్స్ పైన మీ అభిప్రాయమేమిటో తెలియజేయండి జరా.

Share post:

Latest