వరుణ్ తేజ్ పెళ్లిపై మెగా ఫ్యామిలీ మాటేమిటంటే..?

ఇండస్ట్రీ అనగానే ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలాగే హీరో హీరోయిన్స్ కి ఇలాంటివన్నీ సహజం. ముఖ్యంగా నటీనటుల ప్రేమ గురించి మరియు పెళ్లి వార్తలు గురించి ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో కొన్ని పుకార్లు నిజం కాకపోవచ్చు మరికొన్ని వార్తలు వాస్తవం అవుతూ ఉంటాయి. ఈమధ్య మెగా హీరో వరుణ్ తేజ్ ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ వ్యవహారం గురించి పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి..

Mega Family List, Heroes, Movies, Photos
వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. పలు సందర్భాలలో వారిద్దరు మంచి స్నేహితులని చెప్పేవారు ఆ స్నేహం కాస్త ప్రేమ వరకు దారి తీసి అది కాస్త పెళ్లి పీటల దాకా వచ్చిందంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థలలో వినిపిస్తున్నాయి.అంతేకాకుండా వీరిద్దరి నిశ్చితార్థం జరిగిపోయిందని.. అలాగే వీరివివాహం కూడా జూన్ నెలలో ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

దాంతో మెగా అభిమానులంతా కూడా ఆశ్చర్యని వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు వీరిద్దరి మధ్య వచ్చిన పుకార్లు నిజమే అని తెలియటంతో మెగా అభిమానులు కూడా షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి ప్రేమకు పెళ్లికి చిరంజీవి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వారు లావణ్య త్రిపాఠిని అంగీకరిస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ ఇంకా రాలేదు.

వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించే సమయంలోనే ప్రేమలో పడ్డారని… అంటూ సదరు జాతీయ మీడియా సంస్థ ఇచ్చిన కథనం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వీరి వ్యవహారం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది. కానీ ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఏ వార్త క్లారిటీగా రాలేదు.. మెగ ఫ్యామిలీ ఈ వార్తలపై అసలు స్పందించలేదు అంటే వీరిద్దరి మధ్య ప్రేమ విషయం నిజమేనేమోనా అన్నట్టుగా పలువురు నెటిజన్ల సైతం తెలియజేస్తున్నారు.

Share post:

Latest