సాయి పల్లవిని వెంటాడుతున్న సమస్య ఇదొక్కటే?

హీరోయిన్ సాయి పల్లవి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. చేసిన మొదటి సినిమా ఫిదాతో సాయి పల్లవి దశ దిశా మారిపోయాయని చెప్పుకోవచ్చు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకొని అప్పటి అగ్ర హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. తనదైన అందం, అభినయం, నటనతో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ క్యూటీ బేబీ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.

సాయి పల్లవి చాలా స్పెషల్. అందాల ఆరబోతకు ఆమడదూరంగా వుంటుంది. అందుకే ఈమెకి తెలుగునాట చేలా ప్రత్యేకమైన పేరు ఉంటుంది. హీరోలకి మల్లె ఆమెకి ఇక్కడ అభిమాన సంఘాలు వున్నాయంటే మీరు నమ్ముతారా? ఆమె ఎక్కడ కనబడినా లేడీ పవర్ స్టార్ అంటూ ఆమెని పిలుస్తూ వుంటారు. అంతలా సాయి పల్లవి ఇక్కడ పేరు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ చాలా పద్ధతిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఈ క్రమంలో కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.

మేకప్ లేకుండానే ఆమె ప్రతి సినిమాలోనూ నటిస్తుందనే విషయం ఎంతమందికి తెలుసు? అయితే కెరీర్ ఆరంభం నుంచి ఆమె మేకప్ కు దూరంగా ఉండానికి ఒక బలమైన కారణం ఉందట. సాయి పల్లవి పలు చర్మ సమస్యలతో బాధపడుతుందని టాక్ వుంది. మేకప్ ఉత్పతులను వాడితే ఆమె చర్మంపై ర్యాషెస్, తీవ్రమైన దురద వంటి సమస్యలు వస్తాయట. పైగా మొదటి నుంచి ఆమెకు అసలు మేకప్ వేసుకునే అలవాటు లేదట. తొలి చిత్రం `ప్రేమమ్`లోనూ మేకప్ వేసుకోకుండానే నటించింది. అయితే ఆ టైమ్ లో తన అందంపై సాయి పల్లవి ఎంతో టెన్షన్ పడింది. కానీ, ప్రేక్షకులు ఆమెను బాగా రిసీవ్ చేసుకున్నారు. దాంతో సాయి పల్లవి తనకు మేకప్ అవసరం లేదని అప్పుడే డిసైడ్ అయిందట.

Share post:

Latest